భారత్‌కు సొంతంగా 'ఓఎస్'.. 'భారోస్' పేరుతో అభివృద్ధి చేసిన మద్రాస్ ఐఐటీ

దేశీయ సాంకేతిక నిర్మాణంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది.

Update: 2023-01-24 16:33 GMT

న్యూఢిల్లీ: దేశీయ సాంకేతిక నిర్మాణంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసిన దేశీయ అపరేటింగ్ వ్యవస్థ భారోస్‌ను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ పరీక్షించారు. దాని పనితీరును పరిశీలించారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం మన ప్రధాని డిజిటల్ ఇండియా ప్రస్తావన తీసుకొస్తే, మన స్నేహితులు కొందరు ఆయనను ఎగతాళి చేశారని గుర్తు చేశారు.

ప్రస్తుతం సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, పరిశ్రమలు, విధాన రూపకర్తలు ఆయన దార్శనికతను అంగీకరించారని చెప్పారు. ప్రయాణంలో ఒడిదొడుకులు లేకుండా ఏ జర్నీ కొనసాగదని మరో మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అనేక మంది అవాంతరాలు సృష్టించాలని చూశారని తెలిపారు.

భారొస్ అనేది నూతన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాగా ప్రధానంగా ప్రైవసీ, సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో, ఐఓఎస్ ఫోన్లలో వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. దీని ద్వారా విదేశీ ఓఎస్‌లపై ఆధారపడటాన్నితగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయ వ్యవస్థలను రూపొందించడంలో ఇదో ముందడుగని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు.

Similar News