ఓటు వేసిన వారికి.. బీర్లపై డిస్కౌంట్ ప్రకటించి పబ్‌లు.. ఎక్కడో తెలుసా..!

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.

Update: 2024-05-07 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తమ రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి పబ్ ఓనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటే బీర్లపై మూడు శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో 14 స్థానాలకు పైగా పోలింగ్‌ జరుగుతోంది. రాష్ట్రంలో రెండో రౌండ్‌ ఎన్నికల పోటీలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 41.59% ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే ఈలోగా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు హుబ్బళ్లిలోని ఓ బార్‌ ఓనర్‌ ఓ వినూత్న ఆలోచనను ప్రకటించి ఓటింగ్‌ వేసినట్లు నిరూపించిన వారికి బీరుపై ప్రత్యేక రాయితీ లభిస్తుందని చెప్పారు. హుబ్బళ్లి కుసుగల్ రోడ్డులోని కర్ణాటక వైన్స్ షాపు యజమాని ఈ ప్రకటన చేస్తూ.. బలమైన భారతదేశాన్ని తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకుని మంచి వ్యక్తిని ఎన్నుకుని పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవడంతో పబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Similar News