రాముడి పేరుతో ఓట్లు.. రాహుల్ పై ఫైర్ అయిన స్మృతి ఇరానీ..!

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

Update: 2024-04-27 10:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకు అమేథీలో సమస్యపై దృష్టి పెట్టామని.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేదాని కోసం ఎదురుచూస్తున్నామన్నారు స్మృతి ఇరానీ. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం కేంద్రం పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిందన్నారు. కానీ, రాహుల్, ప్రియాంక అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస మరో కొత్తనాటకానికి తెరలేపుతోందన్నారు. రాముడి పేరుతో ఓట్లు అడిగేందుకు సిద్ధపడిందని మండిపడ్డారు. అందుకే రాహుల్ అయోధ్య పర్యటన అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరు ఉన్న రాయ్‌బరేలీ, అమేథీ సహా పలు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఇవాళ ఖరారు చేసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఐదో విడత పోలింగ్ లో భాగంగా అమెథీలో మే 20 న పోలింగ్ జరగనుంది. అయితే.. అమెథీ నియోజకవర్గం నుంచే రాహుల్ పోటీ చేశారు. కానీ 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యాడు.

Similar News