ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చిరుత.. కానీ కుక్క దెబ్బకు పరుగోపరుగు (వీడియో)

చిరుతను చూస్తే మీసాలు తిరిగిన మగాడికి కూడా భయం వేయడం సర్వసాధారణం.

Update: 2023-06-28 16:58 GMT

దిశ, వెబ్ డెస్క్: చిరుతను చూస్తే  మీసాలు తిరిగిన మగాడికి కూడా భయం వేయడం సర్వసాధారణం. ఇక జంతువులు కూడా చిరుతను చూస్తే వణికిపోతాయి. అయితే ఓ కుక్క మాత్రం తనపై దాడికి దిగిన చిరుతపై ప్రతి దాడి చేసింది. దీంతో చిరుత తోకముడిచి పారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని రాహూరి తాలూకాలో జరిగింది. రాత్రి సమయంలో అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత ఓ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే ఇంటి ముందు కాపలాగా ఉన్న ఓ కుక్కపై చిరుత దాడికి దిగింది. అయితే  ఆకుక్క ప్రతిదాడి చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News