ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థి బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలుంటే రూ.2లక్షలు!

ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపు కోసం పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను తమ వైపు ఆకర్షించుకొని, తమకు ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వివిధ హామీలు ఇస్తూ,

Update: 2024-05-10 06:12 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపు కోసం పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను తమ వైపు ఆకర్షించుకొని, తమకు ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వివిధ హామీలు ఇస్తూ, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఇచ్చిన హామీ ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల13న 8 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతి లాల్ భురియా మహిళల కోసం స్పెషల్ హామీ ఇచ్చారు. రాట్లం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈయన, తాను గెలిస్తే మహాలక్ష్మి పథకం కింద, అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.8500 ఇస్తాను అని ప్రకటించారు. అంటే సంవత్సరానికి రూపాయలు రెండు లక్షల నాలుగు వేలు. ఇది బాగున్నప్పటికీ ఆయన తర్వాత ఇద్దరు భార్యలు ఉన్నవారికి కూడా ఇది వర్తింపజేస్తాము అని ప్రకటించారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇద్దరు భార్యలుంటే సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తారా.. ఇది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేసిన కామెంట్స్ మాత్రమే, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News