ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు

దిశ, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రెమా రాజేశ్వరికి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోయిలకొండ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ 2018‌లో 3.14 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో వెంకటమ్మ తమ్ముడు ఆమెను మోసం చేసి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం దానిని ఆమెకే ఇస్తానని నమ్మించాడు. కొద్ది రోజులకు ఆ స్థలాన్ని వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. ఇదేంటని అడిగిన […]

Update: 2021-03-05 07:41 GMT

దిశ, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రెమా రాజేశ్వరికి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోయిలకొండ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ 2018‌లో 3.14 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో వెంకటమ్మ తమ్ముడు ఆమెను మోసం చేసి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం దానిని ఆమెకే ఇస్తానని నమ్మించాడు. కొద్ది రోజులకు ఆ స్థలాన్ని వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. ఇదేంటని అడిగిన తనను అతడు భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బాధితురాలు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్, ఎస్పీకి కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News