బొల్లారంలో ప్రణబ్ గుర్తుగా… నక్షత్ర వాటిక

దిశ, కంటోన్మెంట్: భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ఆయన వివిధ హోదాలలో పర్యటించగా, 2012 జూలై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిసెంబర్ మాసంలో ప్రణబ్ శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. అయితే ఈ రాష్ట్రపతి నిలంయంలో ప్రణబ్ కనువిందు చేసేలా అందంగా నక్షత్ర వాటికను ఏర్పాటు చేశారు. 2013లో డిసెంబర్‌లో ఈ వాటిక ఏర్పాటుకు శ్రీకారం […]

Update: 2020-08-31 11:52 GMT

దిశ, కంటోన్మెంట్: భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ఆయన వివిధ హోదాలలో పర్యటించగా, 2012 జూలై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిసెంబర్ మాసంలో ప్రణబ్ శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు.

అయితే ఈ రాష్ట్రపతి నిలంయంలో ప్రణబ్ కనువిందు చేసేలా అందంగా నక్షత్ర వాటికను ఏర్పాటు చేశారు. 2013లో డిసెంబర్‌లో ఈ వాటిక ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఏడాది తర్వాత ఆయనే ప్రారంభించారు. ఎకన్నర స్థలంలో వలయాకారంలో నక్షత్ర వాటికను చుడ ముచ్చటగా తీర్చిదిద్దారు. 27 రకాల నక్షత్రాలు, 9 గ్రహాల పేరుతో మొక్కలను ఏర్పాటు చేశారు. ప్రణబ్ ఏర్పాటు చేసిన నక్షత్ర వాటిక సందర్శకులను విశేషంగా ఆకట్టకుంది.

Tags:    

Similar News