అదీ పౌరుషం అంటే..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఒకేసారి రావటంతో అక్కడక్కడా గొడవలు జరిగాయి. చిత్తూరు, అనంతపురం, గుంటూరుతో పాటు అక్కడక్కడా ఘర్షణ వాతావరణంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించాయి. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నామినేషన్ వేయడానికి వచ్చిన ఓ అభ్యర్థిని కొందరు అడ్డుకున్నారు. […]

Update: 2020-03-13 23:29 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఒకేసారి రావటంతో అక్కడక్కడా గొడవలు జరిగాయి. చిత్తూరు, అనంతపురం, గుంటూరుతో పాటు అక్కడక్కడా ఘర్షణ వాతావరణంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించాయి. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నామినేషన్ వేయడానికి వచ్చిన ఓ అభ్యర్థిని కొందరు అడ్డుకున్నారు. ఆయన వయసులో కూడా పెద్దాయన. ప్రత్యర్థులు అడ్డుకోవడంతో అతడు తొడ కొట్టాడు. నామినేషన్ వేసే విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నట్టు ముందుకు దూసుకెళ్లాడు. ఈ వీడియోను స్థానికులు కొందరు మొబైల్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు జనసేన పార్టీ నేత నాగబాబు కంటపడింది. ఈ వీడియోను నాగబాబు ట్వీట్ చేసి.. అది పౌరుషం అంటే వైఎస్సార్ సీపీ వారి గూండాగిరికి నిలబడ్డ పెద్దాయన అంటూ ప్రశంసలు కురింపించారు. ఈ పెద్దాయన ఎవరని ఆరా తీశారట. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డిగా గుర్తించారు. ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వస్తే కొందరు అడ్డకున్నారని తెలుస్తోంది.

tags;Seems to be obstructed, Nagababu applauded,That is the charge..

Tags:    

Similar News