ప్రేమ జంటల రాసలీలలు.. తట్టుకోలేని పెద్దలు ఏం చేశారంటే..?

దిశ, వెబ్‌డెస్క్: ఈ కాలం యువత అన్నింటిలోనూ ముందే ఉంటుంది. ప్రేమ, పెళ్లి, డేటింగ్, బ్రేకప్.. ఇలా అన్నిటిని యువత చాలా ఈజీగా తీసుకొంటుంది. ఇక పెద్ద పెద్ద నగరాలలో  రోడ్డపైనే ప్రేమ జంటలు ముద్దుల్లో మునిగితేలుతుంటారు. చుట్టూ జనం చూస్తున్నారన్న ఇంగితం కూడా కొంతమందికి ఉండదు. ఇక ఈ కరోనా వలన పార్కులు, థియేటర్లు మూసివేయడంతో ప్రేమ పక్షులకు ఏకాంతం కరువైంది. దీంతో ఎక్కడైతే ఏంటి కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అని రోడ్డెక్కస్తున్నారు. సరే.. మాట్లాడుకున్నంతవరకు ఓకే […]

Update: 2021-08-02 01:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ కాలం యువత అన్నింటిలోనూ ముందే ఉంటుంది. ప్రేమ, పెళ్లి, డేటింగ్, బ్రేకప్.. ఇలా అన్నిటిని యువత చాలా ఈజీగా తీసుకొంటుంది. ఇక పెద్ద పెద్ద నగరాలలో రోడ్డపైనే ప్రేమ జంటలు ముద్దుల్లో మునిగితేలుతుంటారు. చుట్టూ జనం చూస్తున్నారన్న ఇంగితం కూడా కొంతమందికి ఉండదు. ఇక ఈ కరోనా వలన పార్కులు, థియేటర్లు మూసివేయడంతో ప్రేమ పక్షులకు ఏకాంతం కరువైంది. దీంతో ఎక్కడైతే ఏంటి కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అని రోడ్డెక్కస్తున్నారు. సరే.. మాట్లాడుకున్నంతవరకు ఓకే కానీ.. ఆ మాటలు హద్దులు దాటి చేతలు వరకు వెళ్లి.. రోడ్డుపైనే ముద్దులు, హగ్గులు అంటూ అసభ్యంగా ప్రవరిస్తుంటే చూసేవారికి చిరాకుగా ఉంటుంది. తాజాగా ఇదే సమస్య ముంబా నగరంలోని బొరివలీ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో వారు తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది,

వివరాలలోకి వెళితే.. ముంబైలోని బొరివలీలో ఉన్న సత్యం శివం సుందరం సొసైటీ.. నిత్యం రద్దీ గా ఉంటూ.. వచ్చిపోయే వాహనాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక ఈ సొసైటీ కి ఎదురుగా ఒక అందమైన రోడ్డు ఉంటుంది. దాన్ని లవర్స్ రోడ్ అని కూడా అంటారు. సాయంత్రం అయితే చాలా అక్కడికి గుంపులు గుంపులుగా ప్రేమ జంటలు వాలిపోతాయి. ఐదు గంటలు అయితే చాలు కార్లు, ద్విచక్ర వాహనాలపై యువతీయువకులు అక్కడ వాలిపోయి.. రొమాన్స్ లో మునిగి తేలిపోతారు. ఎంతమంది చూస్తున్నా వారి పని వారిదే. చీకటి పడేవరకు ఆ ముద్దు మురిపాలలో తేలియాడుతూ ఉంటారు. అయితే వీరి శృంగార సన్నివేశాలు మొత్తం సత్యం శివం సుందరం సొసైటీ ఎదురుగా ఉండే భవనాల్లో వారికి స్పష్టంగా కనిపిస్తుంది.

కొంతమంది వాటిని ఎంజాయ్ చేసినా.. మరికొంతమందికి అవి చాలా ఎబెట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సాయంత్రం అటువైపు నుంచి సొసైటీ నివాసుతులు రాలేని పరిస్థితి.. ఇక ప్రశాంతంగా అపార్ట్‌మెంట్‌ బాల్కానీలో కూర్చుందామంటే.. కిటికీలు తెరుచుకుందామనుకుంటే వారి లీలలే కనిపిస్తున్నాయి. దీంతో ఆ కాలనీ వాసులందరు కలిసి అధికారులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక కాలనీ వాసులే దీనికి ఓ చక్కటి పరిష్కారం కనుగొన్నారు. ఆ ప్రదేశంలోని రోడ్డు పై ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ రాయించారు. ఇంకేముంది ఈ ఒక్క పనితో ప్రేమ జంటల ఆగడాలకు చెక్ పెట్టారు. రహహదారిపై ఆ రాతలు రాయించాకా అటుగా వచ్చే ప్రేమ జంటల సంఖ్య తగ్గిందట. దీంతో తాము వేసిన ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా వీరు మంచి ఆలోచన చేసారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News