ఎంఎస్ఎంఈ రంగానికి భారీగా ఉపశమన ప్యాకేజీ కావాలి : అసోచామ్

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి పరిశ్రమను ఆదుకోవడానికి భారీగా ఉపశమన ప్యాకేజీని ప్రకటించాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సంఘం అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. గతేడాది సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమకు సెకెండ్ వేవ్ రూపంలో మరోసారి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీన్ని అధిగమించేందుకు ఎంఎస్ఎంఈలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని అసోచామ్ తెలిపింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మెరుగైన […]

Update: 2021-05-23 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి పరిశ్రమను ఆదుకోవడానికి భారీగా ఉపశమన ప్యాకేజీని ప్రకటించాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సంఘం అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. గతేడాది సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమకు సెకెండ్ వేవ్ రూపంలో మరోసారి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీన్ని అధిగమించేందుకు ఎంఎస్ఎంఈలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని అసోచామ్ తెలిపింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మెరుగైన ప్రణాళిక రూపొందించాలని అసోఆమ్ అధ్యక్షుడు వినీత్ అగర్వాల్ తెలిపారు. తక్షణమే ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు కావాల్సిన పలు సూచనలను ఆయన వెల్లడించారు. అందులో.. ఎంఎస్ఎంఈల మూలధన పరిమితిని బ్యాంకులు 20 శాతానికి పెంచాలని, ఎంఎస్ఎంఈలకు చెందిన మొండి బకాయిలు(ఎన్‌పీఏ) పునర్‌వ్యవస్థీకరణ జరగాలని అన్నారు.

అలాగే, చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులకు ప్రత్యక్షంగా ప్రయోజనాలు ఉండేలా మూలధన రుణాలను అందించాలని, గ్రామీణ రంగంలో వృద్ధి కోసం నిర్దిష్ఠమైన చర్యలను చేపట్టాలని వినీత్ అగర్వాల్ వివరించారు. గతేడాది కరోనా సమయంలో పెద్ద సంస్థలు సులభంగానే బయటపడ్డాయని, రెండో వేవ్‌తో ఆర్డర్లు లేక పెద్ద సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వినీత్ తెలిపారు. వస్తువుల వినియోగం పెరగడంతో ధరలు పెరిగాయి. దీంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంది. ఈ క్రమంలో మొత్తం ఎంఎస్ఎంఈ రంగం తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా, ఆతిథ్యం, పర్యాటక, సేవా రంగాలు మరింత దారుణంగా ప్రభావితమయ్యాయని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News