ఆఫర్ తిరస్కరించిన ఎంఎస్ ధోని

దిశ, స్పోర్ట్స్: క్రీడా మైదానంలో, వెలుపల నిర్ణయాలు తీసుకోవడంలో ఎంఎస్ ధోనిది ప్రత్యేక శైలి. కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో అది జట్టుకు ఎంత వరకు ఉపయోగపడుతుందనేది తప్పక ఆలోచిస్తాడు. అలాంటి ఒక సంఘటన తాజాగా ఐపీఎల్‌ (IPL)లో చోటు చేసుకుంది. ఐపీఎల్ షెడ్యూల్ ఆదివారం ప్రకటించడాని కంటే ముందే గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సీఎస్కే (CSK) కెప్టెన్ ధోనీకి ఒక ఆఫర్ ఇచ్చారు. జట్టులో సభ్యులు కరోనా బారిన పడి కోలుకుంటున్నందున.. ఓపెనింగ్ […]

Update: 2020-09-07 11:04 GMT

దిశ, స్పోర్ట్స్: క్రీడా మైదానంలో, వెలుపల నిర్ణయాలు తీసుకోవడంలో ఎంఎస్ ధోనిది ప్రత్యేక శైలి. కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో అది జట్టుకు ఎంత వరకు ఉపయోగపడుతుందనేది తప్పక ఆలోచిస్తాడు. అలాంటి ఒక సంఘటన తాజాగా ఐపీఎల్‌ (IPL)లో చోటు చేసుకుంది. ఐపీఎల్ షెడ్యూల్ ఆదివారం ప్రకటించడాని కంటే ముందే గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సీఎస్కే (CSK) కెప్టెన్ ధోనీకి ఒక ఆఫర్ ఇచ్చారు.

జట్టులో సభ్యులు కరోనా బారిన పడి కోలుకుంటున్నందున.. ఓపెనింగ్ మ్యాచ్ (Opening match) కాకుండా 5 మ్యాచ్ ఆడమని పటేల్ సలహా ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనను ధోని తిరస్కరించాడు. మా జట్టు ప్రస్తుతం కోలుకొని బాగానే ఉందని, తొలి మ్యాచే ఆడతామని స్పష్టం చేశాడు. మ్యాచ్‌ను వెనకకు జరపడం వల్ల క్రికెటర్లు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి.. షెడ్యూల్ ప్రకారమే ఆడతామని వెల్లడించాడు. తొలి వారంలోనే మూడు మ్యాచ్‌లు ఆడటానికి సిద్దంగా ఉన్నట్లు కూడా ధోని చెప్పడంతో ఎలాంటి మార్పులు లేకుండానే ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు బీసీసీఐ (BCCI) వర్గాలు చెప్పాయి.

Tags:    

Similar News