మెగా హీరో విడుదలచేయనున్న 'వినరో భాగ్యము విష్ణు కథ' ట్రైలర్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, మురళీ కిషోర్ అబ్బూరు కాంబోలో వస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'.

Update: 2023-02-06 07:58 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, మురళీ కిషోర్ అబ్బూరు కాంబోలో వస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. కశ్మీరా పరదేశి కథానాయికగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 7 మంగళవారం రోజున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేతులు మీదుగా ఆన్‌లైన్‌లో సాయంత్రం 05:04 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.

Similar News