'సీతారామం'లో సుమంత్ కీ రోల్.. పోస్టర్ రిలీజ్

దిశ, సినిమా : ‘మళ్లీ మొదలైంది’ సినిమా తర్వాత అక్కినేని హీరో సుమంత్ నటించిన ఏ సినిమా థియేటర్‌లో రిలీజ్ కాలేదు.

Update: 2022-07-09 10:54 GMT

దిశ, సినిమా : 'మళ్లీ మొదలైంది' సినిమా తర్వాత అక్కినేని హీరో సుమంత్ నటించిన ఏ సినిమా థియేటర్‌లో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్న'సీతారామం' మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్‌, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా మేకర్స్ మరో పోస్టర్‌ రిలీజ్ చేయగా.. అందులో సుమంత్ గ్రేట్ బ్రిగేడియర్ విష్ణుశర్మగా కనిపించాడు. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగష్టు 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు.

Tags:    

Similar News