రెమ్యూనరేషన్ విషయంలో సుమ టాప్.. ఒక్క షోకు ఎంతంటే..?

స్టార్ యాంకర్ సుమకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిన సంగతే.

Update: 2023-06-02 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిన సంగతే. ఏజ్ మీద పడుతుంటే యాంకర్లకు అయినా హీరోయిన్లకైనా చాలా వరకు అవకాశాలు తగ్గుతుంటాయి. కానీ ఇప్పటివరకు సుమ ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. మలయాళీ అమ్మాయి అయినా తెలుగు వాళ్లకంటే అద్భుతమైన తెలుగు మాట్లాడుతూ.. చక్కని పంచ్‌లతో ఆడియన్స్‌ను అలరిస్తుంది. స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తప్పకుండా ఈ యాంకర్ ఉండాల్సిందే. ఇటీవల సుమ మూవీ ఫంక్షన్లకు హూస్ట్‌గా చెయాల్సి వస్తే ఒక్కో ఈవెంట్‌కు దాదాపుగా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు, టీవీ ప్రోగ్రామ్స్‌కు అయితే ఎపిసోడ్‌కు రూ.2 నుంచి రూ.3 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తోందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More...   ఆరుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి ఉన్న ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా?

Tags:    

Similar News