ఒత్తిడి తట్టుకోలేక ఆ రోజే చచ్చిపోదామనుకున్నా.. 'సీతారామం' నటి

ఇటీవల వచ్చిన 'సీతారామం' సినిమాలో సీతామాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది మృణాల్ ఠాకూర్. అయితే ఈ మూవీతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటి.. Latest Telugu News

Update: 2022-10-03 10:23 GMT

దిశ, సినిమా: ఇటీవల వచ్చిన 'సీతారామం' సినిమాలో సీతామాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది మృణాల్ ఠాకూర్. అయితే ఈ మూవీతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటి.. రీసెంట్ ఇంటర్య్వూలో వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'యంగ్ ఏజ్‌లో మీడియాలోకి రావాలనుకున్నా. అయితే బ్యాంకు ఉద్యోగి అయిన మా నాన్న ముంబయి నుంచి వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. దీంతో ఒక్కదాన్నే అక్కడ ఉండిపోయా. కుటుంబానికి దూరంగా ఉంటూ మీడియాలో పనిచేయడం కరెక్ట్ కాదనిపించింది. ఒత్తిడి వల్ల కొద్దిరోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఒక రోజు లోకల్ ట్రైన్‌లో నుంచి కిందికి దూకేసి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. పేరెంట్స్ గురించి ఆలోచించి ఆ ఆలోచన విరమించుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనలతో మోడలింగ్‌లో అడుగుపెట్టానన్న బ్యూటీ.. సీరియళ్లలో అవకాశం రావడంతో కెరీర్ మొదలైందని చెప్పింది. 

ఇవి కూడా చదవండి : ఆమె ఇప్పటికీ మిడిల్ క్లాస్ అమ్మాయే.. షారుక్ భార్యపై ఫరాఖాన్ ప్రశంసలు

Similar News