రిటైర్మెంట్‌పై స్పందించిన షారుఖ్.. ఎప్పటికీ అలా జరగదంటూ

‘పఠాన్’ మూవీతో మంచి హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.

Update: 2023-02-21 10:00 GMT

దిశ, సినిమా: 'పఠాన్' మూవీతో మంచి హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ 'మీరు పదవీ విరమణ చేసిన తర్వాత బాలీవుడ్‌‌లో పెద్దగా ఎవరుంటారు?' అని అడిగాడు. దానికి షారుఖ్ బదులిస్తూ 'నేను నటన నుంచి ఎప్పటికీ రిటైర్మెంట్ తీసుకోను. ఎవరైనా నన్ను తొలగిస్తే.. మరింత వేగంగా తిరిగి వస్తాను!!' అని బదులిచ్చాడు.

Tags:    

Similar News