తల్లికే పాఠాలు నేర్పుతున్న కూతురు.. ఐశ్వర్యా రాయ్ డ్రెస్ హ్యాండ్లింగ్‌కు టిప్స్ చెప్తున్న ఆరాధ్య

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ బుధవారం నైట్ గాయపడిన చేతితో ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-05-17 09:44 GMT

దిశ, సినిమా: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ బుధవారం నైట్ గాయపడిన చేతితో ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఐశ్వర్య అక్కడికి చేరుకుంది. ఇక ఆమె చేతికి గాయం కావడంతో ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై కనిపించదేమో అని ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. కానీ.. ఐశ్వర్య మాత్రం తన కమిట్మెంట్‌ను చాటుకుంది. తన చేతికి గాయమైనప్పటికీ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది ఈ బ్యూటీ.

నలుపు, తెలుపు, బంగారు రంగుల్లో డిజైన్ చేసిన గౌనులో అత్యంత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను మైమరపించింది. అయితే.. ఐశ్వర్య రాయ్ ఇప్పటివరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద 21 సార్లు నడిచింది. 2002లో మొదటిసారి రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన ఐశ్వర్య ఇప్పటి వరకు దానిని కొనసాగిస్తూనే ఉంది. ఇక ఈసారి చేతికి గాయం అయినా కూడా ఏమాత్రం లెక్కచెయ్యకుండా ఈ ఈవెంట్‌లో సందడి చెయ్యడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఐశ్వర్య డ్రెస్ హ్యాండిల్ చెయ్యడానికి కూతురు ఆరాధ్య టిప్స్ చెప్పడంతో.. ‘తల్లికే పాఠాలు నేర్పిస్తున్న కూతరు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Similar News