బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు కొట్టాడు.. ఆ నిర్మాత చేసిన పనికి ఇప్పటికి డాక్టర్లను కలుస్తూనే ఉన్న.. ప్రముఖ నటి షాకింగ్ పోస్ట్

చిత్ర పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం అని అందరూ అనుకుంటారు.

Update: 2024-05-02 14:23 GMT

దిశ, సినిమా: చిత్ర పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం అని అందరూ అనుకుంటారు. అక్కడ ఉండే నటీ, నటుల జీవితాలు పూల పాన్పుల వలే ఉంటాయి. లగ్జరీ ఇళ్లు, కారు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు అనుకుంటారు. కానీ అది అందరికి సాధ్యం కాదు. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో చాలా మంది తిండి దొరక్క ఇబ్బంది పడే వాళ్లు కూడా ఉంటారు. అంతే కాకుండా.. వారు చేసిన సినిమాలకు రెమ్యునరేషన్ అందకుండా ఇబ్బంది పడేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే వార్తలో నిలిచింది. ఓ నటి తను చేసిన పనికి రెమ్యునరేషన్ అడిగినందుకు ఇవ్వకుండా రూమ్‌లో బందించారంటూ తన గోడు చెప్పుకుంది. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీ శుభ్ షాగున్.

హిందీ సీరియల్ ‘యే హై మొహబ్బతే’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ ముఖర్జీ. ( Krishna Mukherjee ) అంతే కాకండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈమె.. తాజాగా ఓ పోస్ట్ పెట్టి సంచలనం సష్టించింది. ప్రస్తుతం ‘శుఖ షగుణ్’ అనే సీరియల్‌లో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఈ సీరియల్‌లో నుంచి తప్పుకున్నట్లు తెలుపుతూ.. ఓ వీడియో షేర్ చేసింది. ఈ మేరకు ‘ఇది రాస్తున్నప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను కూడా వణుకుతున్నాను. నేను దీని గురించి ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. మేము (నటిలు) ఎంత బాధలో ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఆ బాధను దాచి పెట్టి ప్రకాశవంతగా ఉన్నట్లు కనిపిస్తాము. ఇది వాస్తవం. ఈ వ్యక్తులు మాకు హాని చేస్తారని మా కుటుంబం పోస్ట్ చెయ్యోద్దు అని నన్ను అడుగుతుంది. వారు ఇంకా భయపడుతున్నారు? కానీ నేను ఎందుకు భయపడాలి? ఇది నా హక్కు, నాకు న్యాయం చేయాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

అంతే కాకండా.. ‘‘శుభ్ షగుణ్’ సీరియల్ ఒప్పుకున్నప్పటి నుంచి నాకు ఈ సమస్యలు మొదలయ్యాయి. ఇది కమిట్ అవ్వడం నా జీవితంలో నేను తీసుకన్న పెద్ద చెత్త నిర్ణయం. ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నన్ను ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్, నిర్మాత కుందన్ సింగ్ నేను బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు కొట్టాడు, నన్ను చాలాసార్లు బెదిరించాడు. అంతే కాకుండా కుందన్ సింగ్ చెప్పడం వల్లే కొందరు నన్ను నన్ను గదిలో బంధించారు. ఒకటి కాదు.. రెండుసార్లు నన్ను గదిలో బంధించి, గూండాల్లా ప్రవర్తించారు. ఈక్రమంలోనే నేను దీనిపై పోలీసు కేసు పెట్టాను. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వివాదాన్ని ఎలా కవర్ చేయాలి? అని కుందన్ సింగ్ ఆలోచించుకుంటూ నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ రూ. 39 లక్షలు ఇవ్వకుండా ఆపేసి, ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ కారణంగా నేను చాలా డిప్రషన్‌కు గురయ్యాను. ఆ నొప్పి నుంచి బయట పడేందుకు ఇప్పటికి డాక్టర్లను కలుస్తూనే ఉన్నాను’ అంటూ మరిన్ని విషయాలు పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More..

Anasuya : నొక్కీ నొక్కీ మొత్తం జుర్రేసిందిగా.. ఆ వీడియోను షేర్ చేసిన అనసూయ! 

Similar News