షాకింగ్ న్యూస్: ఇన్నాళ్లకు శోభితతో రిలేషన్‌పై స్పందించిన సామ్.. చైతన్యకు గట్టి కౌంటరిచ్చిందిగా?

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అండ్ నాగ చైతన్య ఒకరు.

Update: 2024-04-27 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అండ్ నాగ చైతన్య ఒకరు. ఏమాయ చేశావే సినిమాతో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబ సభ్యల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ సామ్-చై వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. పలు మనస్పార్థల కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకుని అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి సామ్ అండ్ చైతన్య వేరే వాళ్లతో రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు కుదిపేస్తున్నాయి. గతంలో సమంత.. ప్రీతమ్ అనే అబ్బాయితో లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి నాగచైతన్య కూడా టాలీవుడ్ హీరోయిన్ శోభితతో డేటింగ్ లో ఉన్నాడని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.

అలాగే వీరిద్దరికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే రీసెంట్ గా సామ్ తన పెళ్లినాటి గౌనును రీమోడలింగ్ చేయించి.. ఓ కార్యక్రమానికి వేసుకుని వెళ్లింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించి.. చైతూ అంటే ఎందుకంత కోపం నీకు? పెళ్లి నాటి గౌనును ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? దీనికి కారణం శోభితతో చైతూ రిలేషన్ లో ఉండటమే కారణమా? చైతన్యకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడానికే ఈ గౌను రూపంలో స్పందించావా? లేక చైతూతో మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నావా ఏంటి? అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. 

Read More..

అల్లు అర్జున్‌ కూతురు అర్హపై నిహారిక సంచలన కామెంట్స్.. షాక్‌లో ఫ్యాన్స్? 

Similar News