రేర్ ఫొటో : ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మెగా బ్రదర్స్.. నిక్కర్‌లో పవన్ కళ్యాణ్ మస్త్ ఉన్నడులే..

మెగా బ్రదర్స్ ఎంత కలిసి మెలిసి ఉంటారో ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక స్వయంకృషితో ఎదిగాడు. ఆ తర్వాత తన పెద్ద తమ్ముడు నాగబాబును

Update: 2024-05-09 10:42 GMT

దిశ, సినిమా : మెగా బ్రదర్స్ ఎంత కలిసి మెలిసి ఉంటారో ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక స్వయంకృషితో ఎదిగాడు. ఆ తర్వాత తన పెద్ద తమ్ముడు నాగబాబును ఇదే రంగంలోకి తీసుకొచ్చాడు. కానీ నటుడిగా సక్సెస్ కానీ ఆయన నిర్మాతగా విజయవంతం అయ్యాడు. ఇక మెగాస్టార్ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఊహించని హైప్ సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్‌గా అభిమానులకు దగ్గరైన ఆయన జనసేనానిగా జనంలోకి వెళ్తున్నాడు. అయితే ఈ ముగ్గురు అన్నదమ్ములు చిన్నప్పుడు తమ అక్కాచెల్లెళ్లతో కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.


వరుస క్రమంలో నిల్చున్న ఫొటోలో చిరు బ్లాక్ డ్రెస్ వేసుకోగా.. నాగ బాబు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో ఫొటోకు పోజులిచ్చారు. ఇక సాయి ధరమ్ తేజ్ తల్లి ట్రెడిషనల్‌గా శారీలో కనిపించగా.. పవన్ కళ్యాణ్ నిక్కర్‌లో భలే క్యూట్‌గా ఉన్నాడు. కాగా దీనిపై స్పందిస్తున్న మెగా అభిమానులు.. ఒక్కొక్కరి డ్రెస్ గురించి వర్ణిస్తున్నారు. ముఖ్యంగా పవన్ షార్ట్‌లో మస్త్ ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News