కంచం ముందుకు, మంచం మీదకి.. ఆడపిల్లలు పిలవగానే రావాలి (వీడియో)

‘రావణాసుర’ సినిమాలో అమ్మాయిల గురించి రవితేజ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2023-04-07 08:04 GMT

దిశ, సినిమా: ‘రావణాసుర’ సినిమాలో అమ్మాయిల గురించి రవితేజ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం ఘనంగా విడుదలవగా.. ట్విట్టర్ రివ్యూ పాజిటీవ్‌గానే ఉంది. అయితే ఈ మూవీనుంచి లీక్ అయిన ఓ సీన్‌లో ‘కంచం ముందుకి, మంచం మీదకి పిలవగానే ఆడపిల్లలు రావాలి. లేదంటే నాకు మండుద్ది రా..’ అంటూ ఓ అమ్మాయిని భయపెడుతూ రవితేజ చెప్పిన డైలాగ్ చర్చనీయాంశమైంది. దీనిపై మహిళలు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠతో నెటిజన్లు భిన్నమైన చర్చలు మొదలుపెట్టారు. ఇక రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా నటించారు

Tags:    

Similar News