సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ రీరిలీజ్‌.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త రికార్డ్

ఇండియన్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అపరిచితుడు’.

Update: 2024-05-14 15:10 GMT

దిశ, సినిమా: ఇండియన్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అపరిచితుడు’. విక్రమ్, సదా జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్దా సంచలనం సృష్టించింది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ పోలీస్‌గా నెగటివ్‌ రోల్‌‌లో మెప్పించాడు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఏకంగా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు టాక్. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 2005లో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రాన్ని ఇప్పుడు రీరిలీజ్ సిద్ధం అయింది.

ఈ మూవీని తెలుగు, తమిళంలో మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 17న రీరిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్‌లో కూడా దీనికి విశేష స్పందన లభిస్తుందని టాక్. మూడు రోజుల్లో ఇది రీరిలీజ్ ఉండటంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని టీమ్‌ తెలియజేయడం విశేషం. మరి రిలీజ్ తర్వాత ఎంత వసూళ్లు చేస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.  

Similar News