షారుఖ్ కింగ్ ఖాన్.. అతన్ని ఎవరూ ఓడించలేరు

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను ఎవరూ ఏ విషయంలోనూ డామినేట్ చేయలేరంటోంది రాశీ ఖన్నా.

Update: 2023-03-31 15:05 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను ఎవరూ ఏ విషయంలోనూ డామినేట్ చేయలేరంటోంది రాశీ ఖన్నా. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న నటి.. ‘ఐఎండీబీ’ ప్రచురించిన ఇండియన్ సెలబ్రిటీస్ పాపులర్ లిస్ట్‌లో షారుఖ్‌ను వెనక్కు నెట్టి మొదటి స్థానం సొంతం చేసుకోవడంపై మాట్లాడింది. ‘నిజంగా ఈ విషయం తెలియగానే నేను చాలా సేపు నమ్మలేదు. నన్ను ఆటపట్టిస్తున్నారు అనుకున్నా. ‘ఐఎండీబీ’ గురించి మా నాన్నకు తెలియకపోయినా.. ‘నేను షారుఖ్ కంటే ముందున్నాను’ అని చెప్పగానే ఆయన షాక్ అయ్యారు. తర్వాత నేను సంతోషించా. ఇలా జరగడం నా లైఫ్‌లో ఒక మైలురాయిగా భావిస్తా. షారుఖ్ కింగ్ ఖాన్. ఆయనను ఎవరూ ఏ విషయంలోనూ ఓడించలేరు. నేను ఆయనకంటే మొదటి ప్లేస్‌లో ఉన్నానంటే.. అది కేవలం నేను పోషించిన పాత్రకు దక్కిన ప్రేక్షకాదరణ మాత్రమే. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో నా క్యారెక్టర్‌ను ప్రజలు అంతగా ఇష్టపడ్డారు. అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి:   Upasana: ఉపాసన హ్యాపీ‌గా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ పేరెంట్స్ మాట దాటవేస్తున్న చరణ్



Tags:    

Similar News