మంచి స్టోరీ ఉంటే చెప్పండి ప్లీజ్ : Parineeti Chopra

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాను సౌత్ సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

Update: 2022-12-12 07:53 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాను సౌత్ సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇటీవల బాలీవుడ్ నటులంతా దక్షిణాది సినిమాలపై కన్నేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో జరిగిన " అజెండా ఆజ్‌తక్‌ 2022 " అనే కార్యక్రమానికి హాజరైన ఆమె..సమావేశంలో మాట్లాడుతూ..ఈ భామ మనసులో మాట బయటపెట్టింది. సౌత్‌ సినిమాల్లో నటించడానికి తానెంతలా ఆరాటపడుతున్నదో వివరించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఏ భాషల్లోని సినిమాల్లో చాన్స్ వచ్చినా వదులుకోనని వెల్లడించింది. అలాగే కొంతకాలంగా హిట్లు లేక కెరీర్‌లో సతమతమవుతున్న ఆమె, ఒక మంచి సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. 'మంచి దర్శకుడు, సరైన స్క్రిప్ట్‌ కలిస్తే అద్భుతమైన ప్రాజెక్టు బయటకొస్తుంది. అలాంటి అవకాశం నాకు దక్కాలి. దయచేసి మీలో ఎవరికైనా ఒక గొప్ప దర్శకుడి గురించి తెలిస్తే చెప్పండి' అని రిక్వెస్ట్ చేయడం విశేషం. కాగా ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ సరసన నటిస్తున్న 'క్యాప్సూల్‌ గిల్‌' అనే సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Read more:

ర్యాగింగ్ కేసును ఛేదించేందుకు విద్యార్థినిగా వెళ్లిన లేడీ పోలీస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Tags:    

Similar News