ఆమె టాలెంట్ ముందు నేను నిలవలేకపోయా.. Mrunal Thakur

ప్రియాంక చోప్రా టాలెంట్ గురించి మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Update: 2023-03-31 11:09 GMT

దిశ, సినిమా :ప్రియాంక చోప్రా టాలెంట్ గురించి మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తనతో పోటిపడేందుకు ఓ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు తన అందాన్ని ఆవిష్కరించడంలో దారుణంగా విఫలమయ్యానని తెలిపింది. రీసెంట్‌గా ఆదిత్య రాయ్ కపూర్ సరసన ఆమె నటించిన ‘గుమ్రా’ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇందులో ఇన్‌స్పెక్టర్ శివాని మాథుర్ పాత్రలో నటించిన మృణాల్.. తాజా ఇంటర్వ్యూలో 2016 లో వచ్చిన ‘జై గంగాజల్’ మూవీలో ప్రియాంక పోలీస్ పాత్రలో అదరగొట్టిన తీరుపై మాట్లాడింది.

‘ఈ చిత్రం కోసం ఆడిషన్‌కు నేను వెళ్లాను. అక్కడ నాకు ఇచ్చిన సీన్‌లో మెప్పించలేకపోయా. అదే సీన్‌ను ప్రియాంక చేసినపుడు ప్రశంసించకుండా ఉండలేకపోయా. అప్పటి నుంచి ఆమె పనితోపాటు ప్రియాంకను అమితంగా ప్రేమిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. చివరగా ‘పనిని నిజాయితిగా ప్రేమించండి. అదే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు చాలా కష్టపడాలి’ అని పీసీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది.

ఇవి కూడా చదవండి: మెగా ఫ్యామిలీలోని ఆడపిల్లలకు అందుకే పెళ్లీలు కలిసి రావడం లేదా?

Tags:    

Similar News