మహిళల మౌనమే వందరెట్ల ఆనందమా?.. గృహ హింసను ప్రశ్నించిన మోనా

బాలీవుడ్ సీనియర్ నటి మోనా సింగ్ గృహ హింసకు వ్యతిరేకంగా తన స్వరాన్ని మరింత పెంచబోతున్నట్లు వెల్లడించింది.

Update: 2022-09-15 12:07 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి మోనా సింగ్ గృహ హింసకు వ్యతిరేకంగా తన స్వరాన్ని మరింత పెంచబోతున్నట్లు వెల్లడించింది. గృహిణుల బాధలను బేస్ చేసుకుని లాక్‌డౌన్ సమయంలో తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ 'ఏక్ చుప్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆమె 'ఆడవాళ్లు నిశ్శబ్దంగా ఉండండి. వందరెట్లు ఆనందాన్ని పొందండి' అనే అంశంపైనే ఈ సినిమా కథ ఆధారపడి ఉంటుందని చెప్పింది.

'నిజానికి చాలా మంది తల్లులు తమ కుమార్తెలను నిశ్శబ్దంగా ఉండమని చెబుతారు. అయితే మౌనం అన్నిసార్లు పనిచేయదు. మహిళలు తమ హక్కుల కోసం నిలబడటం చాలా ముఖ్యం. స్త్రీలు బలంగా మాట్లాడటానికి ఈ చిత్రం స్క్రిప్ట్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది ముఖ్యమైన సమస్యలను కేంద్రంగా చూపిస్తుంది. బయట ఒక మహమ్మారి లోపల మరో మహమ్మారి. ఆడళ్ల జీవితాలపై ఎలా ప్రభావం చూపిందో ఈ చిత్రం కళ్లకు కడుతుంది' అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.

ఆ ముగ్గురు సినిమాను నాశనం చేశారు: 'బ్రహ్మాస్త్ర'పై Actress Erica Fernandes 

Full View

Tags:    

Similar News