ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే ఆగం చేశారు.. లైంగిక వేధింపులపై మోనా
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవంపై ఓపెన్ అయింది మోనా సింగ్. ఈ మేరకు పరిశ్రమలో అందరూ మనవాళ్లే అనుకొని గుడ్డిగా నమ్మినప్పటికీ కాలక్రమంలో కొందరి అసలు రంగు బయటపడిందని చెప్పింది.
దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవంపై ఓపెన్ అయింది మోనా సింగ్. ఈ మేరకు పరిశ్రమలో అందరూ మనవాళ్లే అనుకొని గుడ్డిగా నమ్మినప్పటికీ కాలక్రమంలో కొందరి అసలు రంగు బయటపడిందని చెప్పింది. ‘పూణే నుంచి ముంబైకి ఆడిషన్స్ కోసం వచ్చాను. ఆరంభంలోనే మహిళల పట్ల అసభ్యంగా, అసౌకర్యంగా, విచిత్రంగా, భయంకరంగా ప్రవర్తించే ఇద్దరు వ్యక్తులను కలిశాను.
దీంతో నన్ను నేను రక్షించుకోవడానికి ఇక్కడి నుంచి బయటపడాలా? లేదా ఇక్కడే ఉండి నేనేంటో నిరూపించుకోవాలా? అనే ఆలోచన ఒక్కటే నా మనసులో కొనసాగింది. కానీ కొంతమంది అమాయకమైన స్త్రీలను చూసిన తర్వాత ఇక్కడే ఉండి నాతోపాటు వాళ్లను రక్షించాలని ఫిక్స్ అయ్యాను. నిరుత్సాహపడకుండా నా కలను నిజం చేసుకునేందుకు కొనసాగాను. వాస్తవానికి ఈ సమస్య సినీ పరిశ్రమలో మాత్రమే కాదు ప్రతి చోట ఉంది. అందరికీ వ్యక్తిగత ఎంపికగానూ మారింది’ అంటూ అసక్తికరంగా మాట్లాడింది.
Also Read: మరి అంత బోల్డ్ నా వల్ల కాదనుకున్నా.. కానీ అదే ఇపుడు బోలెడు ఆఫర్లు తెస్తుంది