అల్లు అర్జున్ ఎవరో తెలియదు: సీనియర్ నటి
ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో సరదాగా' తాజా ఎపిసోడ్కు ఎల్. విజయలక్ష్మి అతిథిగా వచ్చింది.
దిశ, సినిమా: ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో సరదాగా' తాజా ఎపిసోడ్కు ఎల్. విజయలక్ష్మి అతిథిగా వచ్చింది. ఇందులో భాగంగా ఆమె చాలా విషయాలను పంచుకుంది. సీనియర్ ఎన్టీఆర్ తనను కోడలా అని ముద్దుగా పిలిచేవారని, 'గుండమ్మ కథ'లో తనతో ఒక్క పాటైనా చేయించాలనే కోరికతో రెండు రోజుల్లోనే సాంగ్ చేయించారని చెప్పుకొచ్చింది. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడు చెప్పక్కర్లేదు. కానీ, ఈ సీనియర్ నటి 'పుష్ప' సినిమా చూసినప్పటికీ బన్నీ ఎవరో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.