తండ్రి అంత్యక్రియలు జరిపేందుకు ఇంటింటికి వెళ్లి అడుక్కున్న లేడీ డైరెక్టర్.. ఆ కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కమ్రాన్ ఖాన్ వరుసగా డిజాస్టర్స్ చవిచూడటంతో మందుకు బానిసయ్యాడు. డబ్బులన్నీ పోగొట్టుకుని ఒంటరి అయిపోయాడు. ఆ బాధతోనే

Update: 2024-05-07 02:59 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కమ్రాన్ ఖాన్ వరుసగా డిజాస్టర్స్ చవిచూడటంతో మందుకు బానిసయ్యాడు. డబ్బులన్నీ పోగొట్టుకుని ఒంటరి అయిపోయాడు. ఆ బాధతోనే తాగి తాగి చనిపోయాడు. ఆయన మరణించే టైంలో పాకెట్ లో ముప్పై రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయితే డబ్బులు ఉన్నప్పుడు తన చుట్టూ తిరిగిన బంధువులు.. అప్పుడు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆయన పెద్ద కూతురు ఫరా ఖాన్ ఇంటింటికి తిరిగి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు పైసలు అడుక్కుంది. ఆ కార్యక్రమం పూర్తి చేశాక అప్పుడు ఉంటున్న పెద్దింట్లో కాకుండా ఓ స్టోర్ రూమ్ లో తమ్ముడు సాజిద్ ఖాన్, తల్లితో కలిసి ఉండిపోయింది.

ఫ్యామిలీకి అండగా నిలిచేందుకు తనకు తానుగా డ్యాన్స్ నేర్చుకున్న ఆమె.. ఓ గ్రూప్ సెట్ చేసుకుని పలు ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించేది. ఈ క్రమంలోనే ' జో జీతా ఓహి సికిందర్ ' సినిమాలో కొరియోగ్రఫర్ గా అవకాశం రాగా... సద్వినియోగం చేసుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 80కి పైగా సినిమాల్లో 100కు మించి సాంగ్స్ కంపోజ్ చేసి.. నేషనల్ అవార్డుతో పాటు పలు సత్కారాలు పొందింది. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి కెరియర్ కొనసాగిస్తుంది.

Similar News