వామ్మో..ఊహించని విధంగా మారిపోయిన కొత్తబంగారు లోకం హీరోయిన్?

ఎక్కడా..అనే డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొత్త బంగారం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేత బసు..ఎక్కడా అంటూ కుర్రకారు మదిలో చెరిగిపోని ముద్ర వేసుకుంది

Update: 2024-04-27 04:02 GMT

దిశ, సినిమా : ఎక్కడా..అనే డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొత్త బంగారం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేత బసు..ఎక్కడా అంటూ కుర్రకారు మదిలో చెరిగిపోని ముద్ర వేసుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా కనిపించి అంరినీ ఆకట్టుకుంది. ఇక మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్వేత బసు క్రేజ్ మాములుగా లేదు, ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా .. సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలం కావడం, ఆఫర్స్ రాకపోవడంతో ఈ అమ్మడు చిత్ర పరిశ్రమకు దూరమైంది.

తర్వాత ఈమెకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయిందంట. ఇలా తన పర్సనల్ లైఫ్‌లో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఇక చాలా రోజులుగా వెండితెరకే కాదు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా తన హాట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ ఈబ్యూటీ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ అందరిని షాక్‌కు గురి చేస్తున్నాయి. బొద్దుగా ఉన్న బ్యూటీ..చాలా సన్నగా.. వయ్యారాలు ఒలుకబోస్తూ చాలా గ్లామర్‌గా ఉంది. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ వావ్ శ్వేత బసు ఇంత గ్లామర్‌గా మారిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News