పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో కమల్ హాసన్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’.

Update: 2023-06-02 06:23 GMT

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో అమితా బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, ప్రాజెక్ట్-కె లో టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం కమల్ హాసన్‌ను సంప్రదించారట. దీనికి లోకనాయకుడు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి 20 రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కమల్ హాసన్ విలన్ పాత్రేనని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read More...   ఒంటినిండా గాయాలతో దేశ సరిహద్దులో హీరోయిన్..! ఫొటోస్ వైరల్

Tags:    

Similar News