మీకు సినిమా అంటే పిచ్చా.. 'హనుమాన్‌' దర్శకుడు బంఫర్ ఆఫర్

‘హనుమాన్’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-05-02 09:37 GMT

దిశ,సినిమా: ‘హనుమాన్’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్‌లో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ చిత్రం సక్సెస్‌తో ఇప్పటికీ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.

హనుమాన్‌', 'జై హనుమాన్‌' సినిమాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమన్న విషయం తెలిసిందే. ఈ యూనివర్స్‌లో మరిన్ని సూపర్ హీరో పాత్రలను తీసుకురానున్నట్లు ప్రశాంత్ ప్రకటించాడు. తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు. సినిమాలు అంటే పిచ్చి ఉన్నా ప్రతిభావంతులు అందరూ తన పీవీసీయూ లో (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌) చేరాల్సిందిగా ఆహ్వానించాడు. దానిలో కళాకారులందరం సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం.

మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? ఇది స్పిన్నింగ్ టేల్స్, అతుకులు లేని ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్ అయినా లేదా బహుశా మీరు మార్కెటింగ్ మావెన్ అయినా, మీ తెలివిగల నైపుణ్యాలతో ప్రపంచానికి జీవం పోస్తున్నారా? మీ కళాత్మక సూపర్ పవర్‌ను మాతో పంచుకోండి మనం కలిసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేద్దాం! మాతో చేరడానికి మీ పోర్ట్‌ఫోలియోలను “talent@thepvcu.com”కి పంపండి. PVCUలో కలుద్దాం! అని పోస్ట్ చేశాడు.

ఇక ఈ చిత్రం 'రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?' అన్న స్టోరీతో రానుంది. ఇక ఈ పోస్టర్ చూసిన ఆడియన్స్‌ థ్రిల్‌గా ఫీలవుతున్నారు. ఈ సినిమాను 2025 విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

Read More..

ఐపీఎల్ మ్యాచ్‌లు చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ 

Similar News