మీడియా ముందే సరసాలాడిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య .. చూడలేక చస్తున్నామని విమర్శలు

' బేబి ' హీరోయిన్ వైష్ణవి చైతన్య తొలి సినిమాతోనే ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్

Update: 2024-05-17 05:22 GMT

దిశ, సినిమా : ' బేబి ' హీరోయిన్ వైష్ణవి చైతన్య తొలి సినిమాతోనే ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తోపాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా తెరపై మెరవాలని, తనను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సెలబ్రిటీస్ కూడా సూచించారు. ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఈ బేబీకి భారీగానే ఆఫర్లు వచ్చినా.. ఆచి తూచి అడుగులేసింది. తన సెకండ్ సినిమాగా 'లవ్ మి' ని ఎంచుకుంది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది టీమ్. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'లవ్ మి - ఇఫ్ యూ డేర్ ' కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు.

ఇందులో భాగంగా సినిమా పర్సనాలిటీస్ కు కాల్ చేసి.. ' లవ్ మి - ఇఫ్ యూ డేర్ ' అని చెప్పించాల్సి ఉంటుంది. దీంతో మన 'బేబి' హీరో ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసిన వైష్ణవి.. ఈ మాట చెప్పాలని కోరింది. దీంతో షాక్ అయిన ఆనంద్.. మన సినిమా చేసినప్పుడు చాలా సార్లు చెప్పా, మళ్లీ కష్టం అంటూ కామెడీ చేశాడు. దీంతో మనం మీడియా ముందున్నామని హింట్ ఇవ్వగా.. నేనే కాదు మన టీమ్ మొత్తంతో చెప్పిస్తా అని 'లవ్ మి ' చెప్పేశాడు. ఇక ఈ కన్వర్జేషన్ విన్న నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీడియా ముందే సరసాలు ఆడుతున్నారని తిట్టి పోస్తున్నారు. ఆనంద్ తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఈమె మాత్రం ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడాలని అంటున్నారు.

Similar News