కరణ్ జోహార్ డ్రెసింగ్‌పై ఫరా ఖాన్ కామెంట్..

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2023-01-30 09:29 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరణ్ మూవీస్ కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే తాజాగా బాలీవుడ్ నిర్మాత, కొరియోగ్రాఫర్ అయిన ఫరా ఖాన్ కరణ్ జోహార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల దుబాయ్‌లో ఒక హోటల్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనగా.. తను ధరించిన డ్రెస్ గురించి టాపిక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె వేసుకున్న దుస్తులపై కరణ్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. ''కరణ్‌ను మనీష్ మల్హోత్రా బృందంలో చూసి షాక్ అయ్యా. అంతేకాకుండా నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ జోహార్ కనిపించడం. అతను ఎప్పుడూ నా బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లా దుస్తులు ధరించేవాడు. అయినా సరే కంఫర్ట్‌గానే ఉన్నాను' అని చెప్పింది ఫరా.

READ MORE

'ఖుషీ' మూవీ షూటింగ్ పై క్లారిటీ.. డైరెక్టర్ ట్వీట్ వైరల్ 

Tags:    

Similar News