తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఆ క్వాలిటీ మాత్రం ముఖ్యం బిగులు

అతిలోక సుందరి శ్రీదేవి నటిమని కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.

Update: 2024-05-16 04:17 GMT

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి నటిమని కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. మత్తెక్కించే కళ్ళ తో కుర్రకారు మనసులు దోచుకుంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ అమ్మడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా జాన్వీ తన కాబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది.ఈ ఈవెంట్లో మీడియాతో మూవీ టీమ్ మాట్లాడింది. ఓ జర్నలిస్ట్ మీకు కాబోయే వాడు ఎవరు? ఎలా ఉండాలి అని అడిగారు. దీనికి జాన్వీ స్పందిస్తూ. నా కలలను తన కలలుగా భావించేవాడు.. నాకు బలమిచ్చే వాడు. నన్ను ఎదగనిచ్చే వాడు.. నాకు సంతోషాన్నిచ్చేవాడు.. నన్ను నవ్వించేవాడు.. ఒకవేళ నేను ఏడుస్తుంటే.. నాకు అండగా నిలబడే వాడు కావాలి" అని జాన్వీ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్ పహారియాతో ఈ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.


Similar News