Pawan kalyan instagram : ఇన్‌స్టాలో పవన్ ఫస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా?

గబ్బర్ సింగ్ సినిమాలో "నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా"

Update: 2023-07-05 07:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : గబ్బర్ సింగ్ సినిమాలో "నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా" అన్న డైలాగ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాత్రమే సెట్ అవుతుంది. పవన్ సినిమా నుంచి చిన్న అప్డేట్ బయటకి వచ్చిన అది నిముషాల్లోనే ట్రెండ్ అవుతుంది. 24 గంటలు పాటు పవన్ మేనియా కనిపిస్తుంది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ అక్కడ కూడా ఏ స్టార్ హీరోకి లేని కొత్త రికార్డు క్రియోట్ చేశాడు. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే 1.7 మిలియన్ ఫాలోవర్లను పవన్ సాధించారు. మరి కొన్ని గంటల్లోనే 2 మిలియన్లను చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పవన్ తన ఫస్ట్ పోస్ట్ ఏమి పెడతారనే దానిపై సీని వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్‌ని సాధించిన లిస్టులో 9వ సెలెబ్రెటీగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రికార్డు సెట్ చేశారు. పవన్ పెట్టే ఫస్ట్ ఫోస్ట్ కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ ఇన్‌స్టాలో తన అప్‌కమింగ్ మూవీ OG ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తారని ఇప్పటికే డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ అఫిషియల్‌గా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఇది ఫస్ట్ పోస్ట్ కాదని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి పోస్ట్ పొలిటికల్ పార్టీకి సంబంధించినది అయి ఉంటుందని తెలుస్తుంది. 

Read more: Pawan kalyan on instagram : ఇది పవర్ స్టార్ రేంజ్.ఇండియాలోనే మొదటి వ్యక్తి!

Tags:    

Similar News