Srikanth Addala సినిమా ఈవెంట్‌లో Viajy తో గొడవలపై మాట్లాడను.. Anasuya

బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెరపై పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

Update: 2023-09-16 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెరపై పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఒకప్పుడు అనసూయ, విజయ్ దేవరకొండకు ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి పెద్ద వివాదమే జరిగినట్లు అప్పట్లో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వీరిద్దరు అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ద కాపు’ సినిమాతో ఈ హాట్ యాంకర్ సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనసూయకు విజయ్ దేవరకొండతో గొడవలపై పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఈ అమ్మడు స్పందిస్తూ.. ఇది శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా ఈ వేడుకలో నేను ఏ గొడవల గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఇదే ప్రశ్నను ఏ ఈవెంట్‌లో అయినా అడగండి చెబుతాను. కానీ మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య అర్జున్ రెడ్డి సమయంలో మొదలైనటువంటి గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందా? అని షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : మళ్లీ కలుసుకోబోతున్న ఎక్స్ లవర్స్.. సినిమా కూడా చేస్తారట..

Tags:    

Similar News