మళ్లీ కలుసుకోబోతున్న ఎక్స్ లవర్స్.. సినిమా కూడా చేస్తారట..

by Disha Web Desk |
మళ్లీ కలుసుకోబోతున్న ఎక్స్ లవర్స్.. సినిమా కూడా చేస్తారట..
X

దిశ, సినిమా : ఎక్స్ లవర్స్ కరీనా కపూర్, షాహిద్ కపూర్ మరోసారి తెరపై రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ‘జబ్ వి మెట్’తో సూపర్ డూపర్ కెమిస్ట్రీ సెట్ చేసిన ఇద్దరు.. అప్పట్లో ప్రేమాయణం నడిపారని వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఎవరి లైఫ్‌లో వాళ్లు సెటిల్ అయిపోయినా.. ఈ మూవీ సీక్వెల్‌తో మళ్లీ కలవబోతున్నారని టాక్. అష్టవినాయక్ ఓనర్ రాజ్ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. ఒరిజినల్ మూవీ దర్శకుడే డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. మోస్ట్ లవ్డ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఉన్న ‘జబ్ వి మెట్’ 16ఏళ్ల తర్వాత ఈ ఏడాది వాలెంటైన్స్‌ డేకు రీరిలీజ్ అయింది. ఆ టైమ్‌లో మాట్లాడిన షాహిద్.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్పకుండా నటిస్తానని తెలిపాడు. అయితే ఈ సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది.

ఇవి కూడా చదవండి : Srikanth Addala సినిమా ఈవెంట్‌లో Viajy తో గొడవలపై మాట్లాడను.. Anasuya

Next Story