పుష్ప-2 లోనూ క్రేజీ ఐటమ్ సాంగ్.. స్టార్ హీరోయిన్‌తో ప్లాన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

Update: 2022-10-10 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లే సాధించింది. మరీ ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్ ఇండియాను షేక్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అందరూ పుష్ప-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, పుష్ప-2లోనూ సుకుమార్ మరో స్టార్ హీరోయిన్‌తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా బాలీవుడ్ బ్యూటీ మలైక అరోరాను అనుకోగా, ప్రస్తుతం తమన్నా భాటియాతో టైటమ్ సాంగ్ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : పెళ్లి వద్దంటున్న గోవా బ్యూటీ (Ileana bikini photos).. ఆమెకు అసలేం కావాలో తెలుసా ?

Tags:    

Similar News