రేర్ పిక్‌తో అన్నయ్య Chiranjeevi కి Pawan Kalyan స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు.

Update: 2023-08-22 12:32 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయనకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. వీరందరితో పాటుగా మెగాస్టార్ కుటుంబం నుంచి ఒక్కొక్కరు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన స్టైల్‌లో విష్ చేశాడు. చిన్నప్పుడు చిరు పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ అరుదైన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆయన.. ‘అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిరుని ట్యాగ్ చేశాడు. ఇక ఈ బ్యూటిఫుల్ పిక్‌ను చూసిన ఫ్యాన్స్ మరింత మురిసిపోతుండగా.. నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి: కొణిదెల శివశంకర వరప్రసాద్ Mega Star Chiranjeevi గా ఎలా ఎదిగారు..? (వీడియో)

Full View

Tags:    

Similar News