రాత్రివేళ ఒంటరయ్యానంటూ.. బెడ్‌రూమ్ వీడియో షేర్ చేసిన అనసూయ (వీడియో)

బుల్లితెరపై టాప్ యాంకర్స్‌లో ఒకరుగా దూసుకుపోతున్న అందాల భామా అనసూయ భరద్వాజ్. తన అందంతో, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

Update: 2022-10-03 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై టాప్ యాంకర్స్‌లో ఒకరుగా దూసుకుపోతున్న అందాల భామా అనసూయ భరద్వాజ్. తన అందంతో, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అటు టీవీ షోలలో.. సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. సోసల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. తన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే.. ఈ మధ్య కాలంలో అనసూయ పోస్ట్ చేసినా వీడియోస్ కొన్ని విమర్శలకు కూడా దారి తీశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ పెట్టిన వీడియో మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.

యాంకర్ అనసూయ, భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాంపత్య జీవితంలో ఎప్పుడు ఆనందంగా గడిపే అనసూయ.. తాజాగా తను ఒంటరి తన్నాన్ని వీడియో రూపంలో తన అభిమానులతో పంచుకుంది. బెడ్‌పై పడుకున్న అనసూయ పక్కనే భర్త భరద్వాజ్ ప్లేస్‌ను చూపిస్తూ.. ''భరద్వాజ్ ఇంట్లో లేకపోతే గుడ్‌నైట్ నాకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఒంటరిగా నిద్ర పోవాల్సి వస్తుంది'' అనే క్యాప్షన్ పెట్టి వీడియోను షేర్ చేసింది. అయితే ఈ వీడియో క్షణాల్లో వైరల్ కాగా.. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Similar News