సినిమాటోగ్రాఫర్‌గా మారిన Anupama Parameswaran.. ప్రముఖుల ప్రశంసల జల్లు

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. నటిగానే కాదు ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్‌గా రాణించగలనని ప్రూవ్ చేసింది.

Update: 2023-04-11 13:03 GMT

దిశ, సినిమా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. నటిగానే కాదు ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్‌గా రాణించగలనని ప్రూవ్ చేసింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో DOPగా మారి ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్‌లో అనుపమ కెమెరా వర్క్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఒక హీరోయిన్ ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయడం సౌత్‌లో ఇదే మొదటిసారి. కాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది అనుమప. ఇక యూఎస్‌లో నివసిస్తున్న ఒక యువకుడు, అతని తల్లిదండ్రులతో అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Read more:

ఆ అలవాటు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడలేము: Jasmin Bhasin 

Tags:    

Similar News