NTR-Koratala సినిమాలోకి మరో యంగ్ హీరో ఎంట్రీ?

జూనియర్‌ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘దేవర’.

Update: 2023-09-12 15:20 GMT

దిశ, సినిమా: జూనియర్‌ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘దేవర’. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతోంది. హైదరాబాద్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్‌లో తారక్‌పై వచ్చే సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షూట్‌ అయిపోగానే ఇతర యాక్టర్లతో సీన్లను షూట్‌ చేయబోతున్నారట. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా సినిమా ఆలస్యం కాకుండా క్లైమాక్స్‌ను కొరటాల టీం ముందుగానే షూట్‌ చేసిందని ఓ వార్త కూడా బయటకు వచ్చింది. ఇకపోతే ఈ మూవీలోని ఒక పాత్ర చాలా సస్పెన్స్‌గా ఉంటుందట. ఆ పాత్రని చాలా రహస్యంగా ఉంచుతున్నారట. అయితే ఆ పాత్రలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

ఇవి కూడా చదవండి : Tollywood అగ్ర హీరోలు వాడే Cars Prices తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Tags:    

Similar News