Priyanka-chopra- Akshay Kumar మితిమీరిన రొమాన్స్.. అస్సలు నచ్చలేదన్న ట్వింకిల్

హీరో అక్షయ్ కుమార్.. ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయకపోవడానికి అతని భార్య ట్వింకిల్ ఖన్నానే కారణమని చిత్ర నిర్మాత సునీల్ దర్శన్ వెల్లడించాడు. 2005లో వచ్చిన 'బర్సాత్' కోసం ఒక పాటను చిత్రీకరిస్తున్న సమయంలో.. Latest Telugu News

Update: 2022-11-22 07:53 GMT

దిశ, సినిమా : హీరో అక్షయ్ కుమార్.. ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయకపోవడానికి అతని భార్య ట్వింకిల్ ఖన్నానే కారణమని చిత్ర నిర్మాత సునీల్ దర్శన్ వెల్లడించాడు. 2005లో వచ్చిన 'బర్సాత్' కోసం ఒక పాటను చిత్రీకరిస్తున్న సమయంలో.. అక్షయ్ ప్రియాంకతో మితిమీరిన రొమాన్స్ చూడలేనని ట్వింకిల్ ఓపెన్‌గా చెప్పేసిందని, దీంతో అక్షయ్‌ సినిమా నుంచి పూర్తిగా తప్పుకోవడం బాబీ డియోల్ ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయిందని తెలిపాడు.

'అక్షయ్ అండ్ ప్రియాంక జోడి అద్భుతమైన కెమిస్ట్రీని కలిగి ఉంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా అందంగా చిత్రీకరించిన పాటపై ట్వింకిల్ అడ్డుపడటం ఆశ్చర్యమేసింది. ప్రియాంక ప్రపంచ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చే సరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వివరంగా అడిగితే ప్రియాంకతో సమస్యలు ఉన్నాయని ట్వింకిల్ చెప్పింది' అని క్లారిటీ ఇచ్చాడు. అయితే వృత్తికి సొంత విషయాలకు చాలా బేధం ఉందని భావిస్తానన్న ఆయన.. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే మీడియా టీఆర్‌పీ కోసం తప్పుదోవ పట్టించడం బాధకరమంటూ గుర్తుచేసుకున్నాడు.

Read More: మరోసారి పోర్న్ చిత్రీకరణ ఆరోపణలు.. Raj Kundra పై చార్జిషీట్ 


Similar News