Heart Operation కు రూ.15 లక్షలు విరాళం ఇచ్చిన Akshay Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

Update: 2023-01-10 07:39 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా ఆయుషి శర్మ అనే 25 ఏళ్ల ఢిల్లీ యువతి గుండె మార్పిడి కోసం రూ.15 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయుషి తాత యోగేంద్ర అరుణ్ తెలిపారు. 'మేదాంత హాస్పిటల్ వైద్యులు ఆయుషి గుండె కేవలం 25% మాత్రమే పని చేస్తుందని మాకు చెప్పారు. దీంతో ట్రిట్‌మెంట్ కోసం చాలా ఖర్చు అవుతుందన్నారు. డబ్బుకోసం దాతని వెతుకుతున్న సమయంలో.. ఇంతలో అక్షయ్‌ తన గొప్ప హృదయంతో మాకు రూ. 15 లక్షలు ఇచ్చారు' అని చెబుతూ హీరోకి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

1.అలాంటి బాధ ఎవ్వరికీ రాకూడదు.. Samantha

2.ఇరాన్‌లో నిరసనలు.. మరో ముగ్గురికి మరణ శిక్ష

Tags:    

Similar News