సెక్సీగా ఉంటుందంటే ఒప్పుకున్నా: హీరోయిన్ ఐశ్వర్య
‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజీ లో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా భయపడ్డానని ఐశ్వర్య లక్ష్మి తెలిపింది.
దిశ, సినిమా: ‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజీ లో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా భయపడ్డానని ఐశ్వర్య లక్ష్మి తెలిపింది. మూవీ స్టోరీతో పాటు తన క్యారెక్టర్ ‘పూంగుళీ’ గురించి డైరెక్టర్ వివరించినప్పుడు తాను చేయగలననే నమ్మకం లేదన్న ఆమె.. మణిరత్నం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే ముందడుగు వేశానని చెప్పింది. ‘బాధపడకండి.. మీరు దాన్ని ఈజీగా చేసేస్తారు. మీ పాత్ర చాలా సెక్సీగా ఉంటుంది. స్క్రీన్‌పై కొద్ది సమయమే ఉన్నప్పటికీ ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంటుంది’ అని మోటివేట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
అలాగే తనలోని నటనా నైపుణ్యం గురించి మణిసార్‌తో కలిసి పనిచేసే వరకూ తెలియలేదన్న లక్ష్మి.. ‘ఇలాంటి మంచి పాత్ర లభించడం నా అదృష్టం. ఈ అవకాశం రావడం చాలా అరుదు. ఆయనతో పనిచేయడం వల్ల మరింత క్రమశిక్షణతోపాటు ప్రతి ఫ్రేమ్‌లో భావోద్వేగాలను ఎలా పలికించాలో నేర్చుకున్నా. నేను ఎప్పుడూ స్వార్థపూరితమైన నటిలా ఆలోచించను’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి: