డైరెక్టర్‌ సుకుమార్‌ కుమార్తెకు అరుదైన గౌరవం - అతిచిన్న వయసులోనే ఆమెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు

క్రియేట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి అతిచిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.

Update: 2024-05-02 07:16 GMT

దిశ,సినిమా: క్రియేట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి అతిచిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గాంధీ తాత చెట్టు' అనే మెసేజ్‌ ఒరియెంటెడ్‌ మూవీలోని ఆమె నటనకు గానూ మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లో ఉత్తమ నటిగా "దాదా సాహెబ్ ఫాల్కే" అవార్డును సుకృతి వేణికి అందజేశారు. కాగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్ 8 అభ్యసిస్తున్న సుకృతి నటించిన ఈ మూవీ గతంలోనూ పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి, తనదైన నటనకు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు జల్లులతో పాటు అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకుంది.

11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం తో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎన్నో అవార్డులు అందుకుంది. అలాగే జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫీల్మ్‌గా 'గాంధీ తాత చెట్టు' చిత్రం ఎన్నో అవార్డులు అందుకోవడం విశేషం. ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి కూడా ఈ సినిమాకు ఆహ్వానాలు అందుతున్నాయట.

పర్యావరణ పరిరక్షణే ముఖ్య ఉద్దేశం గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌, శేష సింధు రావులు నిర్మాతలు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి బాలనటిగా ఉన్నప్పుడే ఈ అవార్డును అందుకున్న సుకృతి తండ్రి డైరెక్షన్ లో హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి..

Read More..

అనుష్క కక్కుర్తి పడి చేసిన ఆ రెండు తప్పుల వల్ల ఆమె జీవితం సంక నాకి పోయేలా చేశాయా..? 

Similar News