కాజల్ అగర్వాల్‌‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి అభిమాని.. నడుమును.. (వీడియో)

స్టార్ సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా ఉండదు.

Update: 2024-03-06 11:43 GMT

దిశ, సినిమా: స్టార్ సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా ఉండదు. చుట్టూ సెక్యూరిటీలున్నా వారిని నెట్టేసి మరీ సెలబ్రిటీలతో ఫొటోలు దిగడానికి ఎగబడుతుంటారు. ఇసుక పోస్తే రాలనంత జనంలో కూడా వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఓ షాపింగ్ మాల్ లాంచ్‌కు గెస్ట్‌గా హాజరైంది. మాల్ ఓపెనింగ్ ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ శారీలో హాజరై ఆక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది.

కాజల్ రాకతో బంజారాహిల్స్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ ఆకతాయి అభిమాని కాజల్ నిల్చుని ఉండగా.. సడెన్‌గా పక్కకెళ్లి.. తన నడుము పట్టుకుని సెల్ఫీ దిగడానికి ట్రై చేశాడు. కాజల్ ఒక్కసారిగా అలర్ట్ అయి.. ఏం చేస్తున్నావ్ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కాజల్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో కాజల్ స్థానంలో వేరే వాళ్లుండుంటే కచ్చితంగా వాడి చెంప చెల్లుమనిపించేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Similar News