రామ్ చరణ్ ‘జరగండి’ సాంగ్‌కు ఎన్ని కోట్లో తెలుసా? కండ్లు బైర్లు గమ్మాల్సిందే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ అయింది.
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట విడుదలకు ముందే లీకైనా.. దర్శకుడు శంకర్ తన విజువల్స్‌తో ప్రేక్షకులు నోరెళ్లబెట్టేలా చేశారు. తనదైన డ్యాన్స్ స్టెప్పులతో చరణ్, కియారా ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఈ పాటకు దర్శకుడు శంకర్ ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా రూ.18 కోట్లు ఖర్చు చేశాడని వార్త వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరికొందరు శంకర్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే, పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. తమన్ సంగీతం అందించగా.. ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.