ఆ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోవడం కోసమే.. విజయశాంతి తన భర్తకు విడాకులిచ్చిందా?

సీనియర్ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈమె పెట్టింది పేరు. ఈమె స్టార్ హీరోలకు సైతం షాకిచ్చే విధంగా ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

Update: 2024-05-09 07:08 GMT

దిశ, సినిమా : సీనియర్ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈమె పెట్టింది పేరు. ఈమె స్టార్ హీరోలకు సైతం షాకిచ్చే విధంగా ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఓసెయ్.. రాముల్మ సినిమా ఈమె కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎవరినైనా రాములమ్మా అని పిలిస్తే చాలు విజయశాంతినే గుర్తు వస్తుంది అంటుంటారు. అయితే తాజాగా ఈ నటిపై సీనియర్ జర్నలిస్ట్, ఈ మంది రామారావు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. సీనియర్ నటి విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఆమె ఆ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అవన్నీ ఫేక్. బాలకృష్ణ, విజయశాంతి కాంబో అంటే ఆరోజుల్లో చాలా మందికి ఇష్టం. అంతే కాకుండా వీరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుండేది. అందుకే చాలా సినిమాల్లో వీరిద్దరు జోడిగా కనిపించారు. ఇక విజయశాంతి, బాలయ్యను పెళ్లి చేసుకోవడం అనేది అసత్యం. ఆ రూమర్ వచ్చిన దాని కంటే ముందే విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్ తో పెళ్లైంది,అసలు బాలకృష్ణ విజయశాంతి కేవలం స్క్రీన్ వరకు మాత్రమే సన్నిహితంగా ఉండే వాళ్ళు,కానీ నిజ జీవితంలో వారిద్దరి మధ్య ఎలాంటి చెడు రిలేషన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయశాంతి రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తుంది.

Similar News